News May 3, 2024
కైకలూరు ఎమ్మెల్యేకు గుండెపోటు
కైకలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఆయన హార్ట్ స్ట్రోక్ రాగానే వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ నాగార్జున నగర్‌లోని ఆయుష్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.
Similar News
News November 6, 2024
ఆగిరిపల్లి: శిక్షణ పొందుతున్న హెచ్ఎం గుండెపోటుతో మృతి
ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలోని హీల్ పారడైజ్ పాఠశాల ఆవరణలో శిక్షణ పొందుతున్న ఉండి మండలం ఇనకుదురు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం టీవీ. రత్నకుమార్ గుండెపోటుతో బుధవారం మృతిచెందాడు. 3 రోజులుగా హెచ్ఎంలకు శిక్షణ ఇస్తుండగా, రత్నకుమార్ హఠాత్తుగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం రత్నకుమార్ మృతిపట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.
News November 6, 2024
కోడూరు: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్
కోడూరు శివారు నరసింహపురం ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వేణుగోపాలరావును విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఈవో రామారావు ఉత్తర్వులు జారీ చేసినట్లు కోడూరు ఎంఈఓ రామదాసు తెలిపారు. తమ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించి తొడపై కొరికాడని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఘటనపై విచారించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
News November 6, 2024
నూజివీడు త్రిపుల్ ఐటీలో 25 అంశాలలో పోటీల నిర్వహణ
నూజివీడు త్రిపుల్ ఐటీలో యువతరం కార్యక్రమం పేరిట సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, లలిత కళలు అనే ఐదు విభాగాల నుంచి 25 అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటి 8, శ్రీకాకుళం 6, ఇడుపులపాయ 5, ఒంగోలు త్రిపుల్ ఐటీలు 4 స్థానాల్లో అర్హత సాధించాయి. ఈ పోటీల్లో ఎంపికైన వారు వచ్చే నెల 26 నుంచి 30 వరకు కాంచీపురంలో నిర్వహించే సౌత్ జోన్ పోటీల్లో ఆర్జీయూకేటీ తరఫున పాల్గొననున్నారు.