News March 9, 2025
కైకలూరు: బాత్ రూమ్‌లో పసింకందు మృతదేహం.. జరిగింది ఇదే.!

కైకలూరు ఆసుపత్రిలో <<15688415>>పసికందు<<>>(ఆడబిడ్డ) మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఐ పి.కృష్ణ వివరాలు.. కైకలూరుకు చెందిన యువతికి తండ్రి లేడు. తల్లే సాకుతోంది. ఆమె తనకు మేనమామ వరుసయ్యే గణేశ్‌తో ప్రేమలో ఉండి, గర్భం దాల్చింది. శుక్రవారం కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి వచ్చి, బాత్ రూమ్‌లో బిడ్డను కని పరారైంది.సీసీ కెమెరాల ఆధారంగా తల్లిని గుర్తించారు. మేనమామపై రేప్ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News March 27, 2025
పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర: ఎస్పీ

ప్రజలు శాంతియుత జీవనంలో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పల్లెనిద్ర చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్‌లో ఎస్పీ, పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.
News March 27, 2025
హీట్ వేవ్.. వారికి కిడ్నీ సమస్యలు!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతకు గురవుతుంటే కష్టజీవులు మండుటెండలో చెమటోడుస్తున్నారు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి మూత్ర పిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో 60శాతం గ్రామీణులే ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. రైతులు, రోడ్డు& భవన నిర్మాణ కార్మికులు, ట్రక్ డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు.
News March 27, 2025
విశాఖ: ప్రేమ పేరుతో గాలం.. గర్భం దాల్చిన బాలిక..!

విశాఖలో 9వ తరగతి చదువుతున్న బాలికను సీతయ్య అనే వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ ఘటనపై MVP పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహితుడైన సీతయ్య.. తల్లి,అన్నయ్యతో కలిసి ఉంటున్న బాలిక(14)కు ప్రేమ పేరుతో గాలం వేశాడు. ఆమెపై పలుమార్లు లెంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా గర్భవతని తేలింది. దీంతో సీతయ్యపై ఫిర్యాదు చేశారు.