News January 29, 2025
కైకలూరు: బాలికను పెళ్లిచేసుకుంటానన్న టీచర్..విచారణ

స్టూడెంట్‌ను పెళ్లి చేసుకోవాలని ఓ టీచర్‌కు వచ్చిన ఆలోచన విచారణ దాకా వెళ్లింది. కైకలూరు పరిధిలో పనిచేసే టీచర్ 10వ తరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె పెద్దలతో మాట్లాడాడు. ఈక్రమంలో అక్కడ గొడవ జరగ్గా.. బాలిక బంధువులు టీచర్‌పై HMకు ఫిర్యాదు చేశారు. దీంతో డీవైఈవో పాఠశాలలో విచారణ చేపట్టారు. ఆ టీచర్‌పై వేరు వేరు ఫిర్యాదులు ఉన్నట్లు తెలింది. ప్రస్తుతం ఆ టీచర్ మెడికల్ లీవ్‌లో ఉన్నారు.
Similar News
News February 18, 2025
రేపటి నుంచే మెగా టోర్నీ.. గెలిచేదెవరో?

రేపటి నుంచి మార్చి 9 వరకు మెగా క్రికెట్ సమరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మరి ఈ టోర్నీలో విన్నర్స్, రన్నర్స్, అత్యధిక పరుగులు, వికెట్లు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎవరు నిలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. గత టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
News February 18, 2025
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. నిందితులకు ముగిసిన విచారణ

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.
News February 18, 2025
డ్రైనేజీ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలి: కమిషనర్

డ్రైనేజీ నిర్మాణానికి ప్రజల సహకరించాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో డ్రైన్ ఏర్పాటుకు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. స్థానికుల సౌకర్యార్థం డ్రైన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, స్థానికులతో పాటు సదరు యజమాన్యం సహకరించాలని, వారికి న్యాయం చేస్తామని కమిషనర్ తెలిపారు.