News November 2, 2024

కైకలూరు: బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని ఆమెపై అత్యాచారయత్నం చేసిన ఘటనలో శనివారం పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకటకుమార్ తెలిపారు. కైకలూరుకి చెందిన బాలికను, అదే గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి శారీరకంగా అనుభవించడానికి ప్రయత్నించగా బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 7, 2024

కృష్ణా: 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

image

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 20లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA అధికారిక వెబ్‌‌సైట్‌లో CAREERS ట్యాబ్ చూడవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

News December 7, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు 2 కేంద్రీయ విద్యాలయాలు 

image

దేశంలో నూతనంగా ఏర్పాటు కానున్న 85 కేంద్రీయ విద్యాలయాల్లో 8 సంస్థలను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగామ, నూజివీడులో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ తెలిపింది. గతంలో ఈ 2 ప్రాంతాలకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 

News December 7, 2024

కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.