News April 14, 2025
కైకలూరు: బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

కైకలూరు స్టేషన్ నుంచి వెళుతున్న తిరుపతి- బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల ఏసీ కోచ్ మీద పెద్ద చెట్టు విరిగిపడింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ట్రైన్ సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
Similar News
News October 21, 2025
ఉద్యోగి ఆత్మహత్య.. వేధింపులపై ఫిర్యాదు చేయలేదు: ఓలా ప్రతినిధి

OLA ఉద్యోగి <<18058963>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై ఆ సంస్థ ప్రతినిధి స్పందించారు. అరవింద్ మూడున్నరేళ్లుగా తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని, ఆ సమయంలో వేధింపుల గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అరవింద్ కుటుంబానికి తక్షణమే అండగా నిలిచేందుకు ఫైనల్ సెటిల్‌మెంట్ డబ్బులు బ్యాంకు అకౌంట్లో వేశామని స్పష్టతనిచ్చారు. CEO భవీశ్‌పై నమోదైన కేసును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.
News October 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 21, 2025
సుప్రీం ఆదేశాలు పట్టించుకోవట్లేదు: రాజ్‌దీప్

ఢిల్లీలో దీపావళి రోజున రాత్రి 8-10 గంటల మధ్య బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే 11pm దాటినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా టపాసులు కాలుస్తున్నారని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. SC ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యానికి ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా వాస్తవాన్ని పరిశీలించాలని కోరారు.