News April 6, 2025

కైకలూరు: విద్యుత్ షాక్‌తో బీపీఎం మృతి

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండలో బీపీఎంగా పని చేస్తున్న బోడావుల నాగదుర్గ బాలాజీ (26) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు సీఐ వేణు తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం నర్సాయపాలెం గ్రామానికి చెందిన బాలాజీ 15 నెలల క్రితం మీదికొండలో పోస్టుమాస్టర్‌గా విధుల్లో చేరాడు. స్టేషన్ ఘనపూర్‌లో నివాసం ఉంటున్న ఆయన నీళ్ల కోసం మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు సీఐ చెప్పారు.

Similar News

News February 26, 2026

TTD పేరుతో నకిలీ వెబ్‌సైట్లు.. జాగ్రత్త

image

AP: శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై TTD విజిలెన్స్ అప్రమత్తమైంది. తిరుమల చిత్రాలు, TTD పేరును ఉపయోగించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఫేక్ వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేసింది. https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే సేవలు పొందాలని సూచించింది.

News February 26, 2026

తిరుమల ఘాట్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు బైకుపై కొండ దిగడానికి ప్రయత్నించారు. 30వ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. నటరాజన్ అనే వ్యక్తి చనిపోగా.. మురళీ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 26, 2026

ఖమ్మం: ఉపసర్పంచ్ పదవికి సర్పంచ్ భార్య రాజీనామా

image

తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం ఉపసర్పంచ్ కుంభం యమున తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భర్త ఉపేందర్ సర్పంచ్‌గా, భార్య యమున ఉపసర్పంచ్‌గా ఎన్నికై భార్యాభర్తలు గ్రామాన్ని ఏలుతూ వార్తల్లో నిలిచారు. అయితే వ్యక్తిగత కారణాలతో బుధవారం ఎంపీడీవో సిలార్ సాహెబ్‌కు ఆమె రాజీనామా పత్రాన్ని అందజేశారు. కేవలం మూడు నెలలకే రాజీనామా చేయడం మండలంలో చర్చనీయాంశమైంది.