News February 1, 2025

కైకలూరు : సాంకేతిక కారణాలతో ప్రారంభం కాని పెన్షన్ల పంపిణీ

image

కైకలూరు మండల పరిధిలో సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఐదున్నర గంటలకి సచివాలయ ఉద్యోగులు వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో పెన్షన్ యాప్ పనిచేయడం లేదని అంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను నివేదించినట్లు సమాచారం.

Similar News

News December 18, 2025

MBNR: లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: SP

image

ఈ నెల 21 న జిల్లాలో జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి గురువారం ఓ ప్రకటనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. క్షణికా వేషంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉత్తమ అవకాశమని, రాజీ మార్గానికి అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరించుకోవాలని కక్షదారులకు సూచించారు.

News December 18, 2025

భారత జట్టుకు ఆడిన పాక్ ప్లేయర్.. విచారణకు ఆదేశం

image

పాకిస్థాన్ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్ భారత్ తరఫున ఆడటం వివాదాస్పదంగా మారింది. బహ్రెయిన్‌లో జరిగిన ఓ టోర్నీలో అతడు ఇండియన్ జెర్సీ, జెండాతో కనిపించడంపై PKF విచారణకు ఆదేశించింది. అనధికారిక మ్యాచ్‌లో అనుమతి లేకుండా ఆడారని పీకేఎఫ్ సెక్రటరీ రాణా సర్వార్ తెలిపారు. దీనిని ఉపేక్షించబోమని, విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రాజ్‌పుత్ క్షమాపణలు చెప్పారు.

News December 18, 2025

విశాఖ: సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు పరిశీలన చేసిన కమిషనర్

image

నగరంలోని ముడసర్లోవ, రాడిసన్ బ్లూ హోటల్, సాగర్ నగర్ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయా ప్రాంతంల్లో పర్యటించి ట్రాక్ పనులపై జీవీఎంసీ ఈఈ, ఇతర అధికారులతో కమిషనర్ చర్చించి సూచనలు చేశారు. అలాగే బీచ్ రోడ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు, మధురవాడలో ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.