News March 17, 2025

కైలాసగిరిపై దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి 

image

కైలాసగిరిపై ఏప్రిల్ నాటికి దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తామని వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ ప్రణవ్ గోపాల్, ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీచ్ రోడ్డులో హెలికాప్టర్ మ్యూజియం, సిరిపురంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News March 18, 2025

విశాఖ: అదనపు కోచ్‌లతో రైళ్ల పెంపు

image

ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి అదనపు కోచ్‌లతో రైళ్లను పెంచాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. రైలు నెం. 58506/58505 విశాఖపట్నం – గుణుపూర్ – విశాఖపట్నం ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ 1×8 నుంచి ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచబడుతుంది. రైలు నం. 18512/ 18511 విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 17 తేది నుంచి రెండు స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచబడుతుంది.

News March 18, 2025

రాజమండ్రి: కోర్టుకు ట్రైల్‌కు తీసుకువచ్చిన నిందితుడు పరార్

image

విశాఖపట్నానికి చెందిన 35ఏళ్ల లావేటి తల్లిబాబును సోమవారం ఒక కేసులో ట్రైల్‌ నిమిత్తం సెంట్రల్‌ జైలు నుంచి రాజమండ్రి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడని త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పారావు తెలిపారు. పారిపోయే సమయంలో పై ఫొటోలో ఉన్న విధంగా దుస్తులు ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు 94407 96532 ఫోన్‌ నంబరుకు తెలపాలన్నారు

News March 18, 2025

విశాఖ స్టేడియంలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్

image

విశాఖ నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఇవాళ ఆ టీమ్ సారథి అక్షర్ పటేల్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది విశాఖలో జరగనున్న ఈ తొలి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

error: Content is protected !!