News April 13, 2025
కైలాసపట్నం ఘటన.. కేజీహెచ్‌కు క్షతగాత్రుల తరలింపు

కైలాసపట్నం మందు గుండు సామగ్రి తయారీ కేంద్రం వద్ద పేలుడు జరిగిన స్థలంలో మరో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతి చెందిన వారిలో ఒకరిని రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మిగా గుర్తించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఇద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. పేలుడు ఎలా జరిగిందో స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. మందు గుండు తయారీ కేంద్రం యజమాని రమేశ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
Similar News
News November 25, 2025
సాయంత్రం టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్

మెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచులు, వేదికల వివరాలను రోహిత్, సూర్య, మాథ్యూస్, హర్మన్‌తో ICC రివీల్ చేయించనుంది. IND, శ్రీలంక సంయుక్తంగా హోస్ట్ చేయనున్న ఈ టోర్నీలో 20జట్లు పాల్గొంటాయి. PAK మ్యాచులన్నీ లంకలో జరుగుతాయి. IND డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది జరిగిన ఫైనల్లో RSAపై 7 రన్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.
News November 25, 2025
ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు
News November 25, 2025
జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.


