News January 10, 2025
కొండంత జనం

తిరుమలలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వీఐపీలతో పాటూ సాధారణ భక్తులు తిరుమల వేంకన్నను ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. నారాయణుడి నామస్మరణతో తిరుమల ప్రాంగణం మార్మోగింది. స్వామి వారి స్వర్ణ రథోత్సవం సందర్భంగా తీసిన ఫొటోలు అబ్బుర పరుస్తున్నాయి.
Similar News
News October 11, 2025
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.
News October 10, 2025
రేపు దేవళంపేటలో పర్యటించనున్న మంత్రి

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోం మంత్రి అనిత శనివారం పరిశీలించనున్నట్లు జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ నాయకులుతెలిపారు. ఉదయం 10 గంటలకు ఆమెతోపాటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.
News October 10, 2025
చిత్తూరు: టీచర్ల శిక్షణను పరిశీలించిన కలెక్టర్

మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు చిత్తూరులోని ఓ స్కూల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. నూతనంగా ఎంపికైన టీచర్లు బాధ్యతాయుతంగా పనిచేసి భావి భారత పౌరులను తయారు చేసేలా కృషి చేయాలని సూచించారు. విధుల్లో చేరిన నాటి నుంచి చివరి దశ వరకు ఉత్సాహంగా పనిచేయాలన్నారు. సమగ్ర శిక్ష ఏపీడీ వెంకటరమణ, ఇందిరా, నాగేశ్వరరావు పాల్గొన్నారు.