News October 14, 2024
కొండగట్టుకు వాహన పూజలతో రూ.3,37,900 ఆదాయం

మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రోత్సవాల (దసరా) సందర్భంగా గతేడాది వాహన పూజల ద్వారా 3 రోజులకు రూ.2,67,600 ఆదాయం వచ్చిందని ఆలయ కార్య నిర్వహణాధికారి తెలిపారు. ఈ ఏడాది మూడు రోజులకు రూ.3,37,900ల ఆదాయం సమకూరిందని, ఈ సంవత్సరం వాహన పూజల ద్వారా రూ.70,300లు అదనంగా సమకూరిందని తెలిపారు.
Similar News
News December 4, 2025
కరీంనగర్: మూడు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం

కరీంనగర్ జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడుచోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి మండలం దేశాయిపేటలో తిరుపతి, పెద్దకురుమపల్లిలో స్వరూప ఏకగ్రీవం కాగా, రామడుగు మండలం శ్రీరాములపల్లిలో సుగుణమ్మ సర్పంచ్‌గా ఖరారయ్యారు. దేశాయిపేటలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా తెలిపారు.
News December 4, 2025
కరీంనగర్ జిల్లాలో 276 వార్డు సభ్యులు ఏకగ్రీవం

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని మొత్తం 866 వార్డులకు గాను, 276 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 590 వార్డులకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
News December 4, 2025
KNR: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు.


