News August 27, 2024

కొండగట్టులో ఇక పార్కింగ్‌కు రుసుం వసూలు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో కొండపై వాహన పార్కింగ్‌కు రుసుము వసూలు చేయనున్నారు. దేవస్థానం కార్యాలయం ముందు గల ఖాళీ స్థలంలో ప్రస్తుతం వాహన పార్కింగ్ చేస్తున్నారు. దేవస్థానం అధికారులు పార్కింగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా అధికారులు పార్కింగ్‌కు రుసుము వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News April 18, 2026

మహిళా పోలీసుల సాధికారతే లక్ష్యం: డీజీపీ శివధర్ రెడ్డి

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించిన ‘షీ లీడ్స్’ సదస్సులో డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీసులు వృత్తిపరంగా, సామాజికంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసు శాఖలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు, భరోసా కేంద్రాల పనితీరును కొనియాడారు. అనంతరం మహిళా సిబ్బందికి స్కూటీలు, రక్షణ సామగ్రిని పంపిణీ చేశారు.

News April 17, 2026

KNR: పాడి పశువుల పథకం దరఖాస్తుల గడువు పొడిగింపు

image

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2025 -26 ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అమలు చేస్తున్న 2 పాడి పశువుల దరఖాస్తు గడువు పొడిగించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23 వరకు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని ఫోటో, ఆధార్, రేషన్, కులం, ఆదాయం, బ్యాంకు పాస్ బుక్, భూమి పట్టా పత్రాలతో MPDO, మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.

News April 17, 2026

కరీంనగర్: టీటీసీసీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 42 రోజుల టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTCC) కోర్సుకు ఈనెల 18 నుంచి 29 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలని, SSCతో పాటు సంబంధిత ట్రేడ్‌లో టీసీసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. దరఖాస్తులు ఈ నెల 29లోపు డీఈవో ఆఫీసులో అందజేయాలన్నారు.