News April 10, 2025
కొండగట్టులో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రేపటి నుంచి జరగబోయే చిన్న జయంతి ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఈ రోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రావు, డిఎస్పి రవిచందర్, సీఐ నీలం రవి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 30, 2025
2020 ఢిల్లీ అల్లర్లు: పోలీసుల అఫిడవిట్లో సంచలన విషయాలు

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు CAA వ్యతిరేక నిరసనల పేరుతో అల్లర్లు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులు ఖలీద్, ఇమామ్, హైదర్ తదితరుల బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు సృష్టించారని అందులో పేర్కొన్నారు.
News October 30, 2025
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి: డీఈవో

పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం ఎంఈవో శివప్రసాద్తో కలిసి ఉండవెల్లి మండలం బొంకూరులో ఎస్ఏ-1 పరీక్షల ప్రక్రియను ఆమె పరిశీలించారు. విద్యార్థులను ఇప్పటి నుంచే పరీక్షలకు సంసిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఎఫ్ఏ-1, 2 మార్కుల జాబితా నమోదు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
News October 30, 2025
ట్రైనింగ్ ప్రోగ్రాం సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ జితేష్

ఫర్నిచర్ అసిస్టెంట్ 3 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా యువతకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. నవంబర్ 6న కలెక్టరేట్లో డ్రాయింగ్పై టెస్ట్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువత ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్స్టలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో నైపుణ్యం సాధించి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆయన చెప్పారు.


