News March 18, 2025

కొండగట్టులో గుర్తుతెలియని కుళ్ళిన మృత దేహం

image

గుర్తుతెలియని కుళ్ళిన మృతదేహం లభ్యమైన ఘటన కొండగట్టు దిగువ ప్రాంతంలోని తుమ్మచెరువు ప్రాంతంలో మంగళవారం జరిగింది. విషయం తెలుసుకున్న మల్యాల ఎస్సై నరేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 20 రోజుల క్రితం మృతి చెందడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. మృతిచెందిన వ్యక్తి ఎవరు.. ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

Similar News

News November 3, 2025

శీతాకాలం అతిథుల రాక మొదలైంది: పవన్

image

AP: పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథులైన ఫ్లెమింగ్ పక్షుల రాక మొదలైందని Dy.CM పవన్ అన్నారు. ‘ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్‌ను మారుస్తాం. ఫ్లెమింగోలు ఆహారం, విశ్రాంతి కోసం అక్టోబరులో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోతాయి. వాటికి ఇబ్బందులు కలగకుండా కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈసారి 3 రోజుల పండుగతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని విస్తరిస్తాం’ అని పవన్ చెప్పారు.

News November 3, 2025

GWL: ప్రజావాణికి 132 ఫిర్యాదులు

image

గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 132 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 60 దరఖాస్తులు అందాయని చెప్పారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

మెదక్: చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి

image

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజురీ కాగా, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. బాధితులతో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ధైర్యం చెప్పారు.