News August 8, 2024
కొండగట్టులో సమస్యలు!

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారి కానుకల ద్వారా ఏటా రూ.20 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతుంది. కానీ.. భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం సరిగ్గా కావడం లేదు. శానిటేషన్ అంతంతమాత్రంగానే ఉండటం.. నిఘా నేత్రాల పర్యవేక్షణ లేకపోవడం సమస్యగా మారింది. శ్రీరాముని ఆలయంలో అర్చకులు ఉండటం లేదని భక్తులు చెబుతున్నారు.
Similar News
News November 24, 2025
KNR: గత 43 నెలల నుంచి రాష్ట్రంలో ‘తొలి స్థానం’

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు. దంత విభాగంలో గత 43 నెలల నుంచి రాష్ట్రంలో తొలి స్థానంలో నిలవడం అభినందనీయమని. 9 నెలలు నుండి వివిధ నోటి శస్త్ర చికిత్సలు బయాప్సీ 53, ట్రామా 42, ఓడోంటోజెనిక్ కెరటోసిస్ట్ 10, డెంటిజరస్ సీస్ట్ 1, డెంటిజరస్ సిస్ట్ 12, అమెలబ్లాస్టోమా 4, ఓరోఫేషియల్ బర్న్స్ 10, లుడ్విగ్స్ అంజైనా 26 లు చేసినట్లు తెలిపారు.
News November 24, 2025
KNR: స్కీల్ డెవలప్మెంట్ కోర్సుకు ధరఖాస్తుల ఆహ్వానం

క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు నిరుద్యోగ క్రైస్తవ మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలిపారు. సోలార్ సంస్థలో టెక్నిషియన్ ఉచిత శిక్షణ ఉంటుందని దరఖాస్తుతో అభ్యర్థి ఆధార్ తదితర సర్టిఫికేట్లు డిసెంబర్ 10 వరకు జిల్లా సంక్షేమ ఆఫీస్లో అప్లై చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 8782957085, 9989727382 నంబర్లో సంప్రదించాలని కోరారు.
News November 23, 2025
KRM: స్కాలర్షిప్ NMMS పరీక్షకి 77మంది గైర్హాజరు

కరీంనగర్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలల్లో NMMS ఆదివారం 9:30 నుంచి12:30 నిర్వహించినట్లు జిల్లా విద్యాధికారి మొండయ్య తెలిపారు. పరీక్షకు 1,507 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,430 మంది హాజరయ్యారని తెలిపారు. 7 పరీక్షా కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు 02 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించబడినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలల్లో ఎలాంటి అవాంతరాలు కలుగలేదని జిల్లా విద్యాధికారి తెలిపారు.


