News April 11, 2025

కొండగట్టులో సర్వం సిద్ధం

image

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగబోయే చిన్న జయంతి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 650 మందితో పోలీసు బందోబస్తు, అదనంగా 65 సీసీ కెమెరాలు, 365 మంది పారిశుధ్ధ్య కార్మికులు, 28 చలివేంద్రాలు, 6చోట్ల వైద్య శిబిరాలు,7చోట్ల పార్కింగ్, 7 చోట్ల ప్రసాదం కౌంటర్లు, 5 ఫ్రీ మినీ బస్సులు, 4లక్షల లడ్డులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

అల్లూరి జిల్లా వాసులకు GOOD NEWS

image

UPSC స్రివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ కోసం అర్హులైన ST అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తునట్లు పాడేరు DD PBK పరిమళ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన ST అభ్యర్థులు తమ బయోడేటా, 2 ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్ కార్డ్ ఇతర జిరాక్స్ కాపీలతో ఈనెల 26లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

News November 24, 2025

సిరిసిల్ల: ప్రజావాణికి 141 దరఖాస్తులు

image

రెవెన్యూ 42, హౌసింగ్ 22, CPO 8, ఉపాధి కల్పన అధికారికి 8, DRDO 7,SDCకి 7, RTO వేములవాడ, DPO, DEOకు 5 చొప్పున, DAOకు 4, నీటి పారుదల శాఖ, ఎక్సైజ్ శాఖ, సెస్‌కు 3 చొప్పున, ఏవో కలెక్టరేట్, బీసీ సంక్షేమ అధికారి, EE PR, DWO, మున్సిపల్ కమిషనర్ SRCLకు 2 చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మత్స్య, మైనారిటీ, DPRO, EDM, ఈఈ R&B MPDO VMLD, YRPT, మున్సిపల్ కమిషనర్ VMLDకు 1 వచ్చాయని అధికారులు తెలిపారు.

News November 24, 2025

మేడ్చల్ ప్రజావాణికి 126 ఫిర్యాదులు

image

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను డీఆర్ఓ హరిప్రియ, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మేడ్చల్ అదనపు కలెక్టర్ రాధికాగుప్తా స్వీకరించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 126 ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను జాప్యం చేయకుండా తర్వరితగతిన పరిశీలించాలన్నారు.