News April 13, 2025
కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణ

కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత కట్టుదిట్టంగా ఉండేలా అధికారులకు సూచనలు ఇచ్చారు. శాంతి, నిబద్ధతతో ఉత్సవాలు నిర్వహించాలని స్థానికులు కోరారు.
Similar News
News December 9, 2025
5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన: CM CBN

AP: గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూములపై పున:పరిశీలన చేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘EX సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్యయోధులు, 1954కి ముందు అసైన్డ్ అయిన వాళ్ల భూములను 22A నుంచి తొలగించాలి. అనుమతుల్లేని 430 రియల్ వెంచర్లలోని 15,570 ప్లాట్లకు యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్లు చేయాలి. 2.77 కోట్ల CAST సర్టిఫికెట్లు ఆధార్‌తో అనుసంధానించాలి’ అని సూచించారు.
News December 9, 2025
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అలాగే తెలంగాణ గేయాన్ని ఉద్యోగులందరూ ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
News December 9, 2025
తొలి విడత ఎన్నికలకు భారీ భద్రత: ఖమ్మం సీపీ

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నిక కోసం 2 వేల మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 953కేసుల్లో 6,403 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.12 లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. 16 సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు.


