News February 1, 2025
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని ఈరోజు రాష్ట్ర డీజీపీ జితేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Similar News
News November 21, 2025
గజపతినగరం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామానికి చెందిన గంట్యాడ అప్పలనాయుడు మానసిక స్థితి బాగోలేనందున ఈనెల 19న పురుగులు మందు తాగినట్లు భార్య సత్యవతి తెలిపారు. అతడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News November 21, 2025
ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 21, 2025
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్

BSFలోకి మొట్టమొదటిసారి మహిళా స్నైపర్ ఎంటర్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాకు చెందిన సుమన్ కుమారి ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్లో కఠిన శిక్షణను పూర్తిచేసి ‘ఇన్స్ట్రక్టర్ గ్రేడ్’ పొందారు. 2021లో BSFలో చేరిన ఆమె పంజాబ్లో ఓ బృందానికి నాయకత్వం వహించారు. స్నైపర్ శిక్షణ కఠినంగా ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.


