News February 1, 2025

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని ఈరోజు రాష్ట్ర డీజీపీ జితేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Similar News

News February 18, 2025

ప్రతీకారం తీర్చుకుంటా: షేక్‌హసీనా

image

ఆవామీలీగ్ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. ఆపార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో జూమ్‌కాల్ ద్వారా హాజరయ్యారు. తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు వస్తానని అందరికీ న్యాయం చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనలో ఎంతోమంది కళాకారులు, పోలీసులు, కార్యకర్తలు హత్యకు గురైనా యూనస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.

News February 18, 2025

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

News February 18, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

image

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం రాగా అతడిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద నుంచి 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

error: Content is protected !!