News February 6, 2025

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు

Similar News

News December 14, 2025

శ్రీకాకుళం: సండే టాప్ న్యూస్ ఇవే

image

✦యువత ధర్మం పట్ల అవగాహాన పెంచుకోవాలి: ఎమ్మెల్యే మామిడి
✦నరసన్నపేట: డంపింగ్ యార్డులో మళ్లీ చెలరేగిన మంటలు
✦ పితాళినల్లూరులో ఎలుగులు హాల్ చల్
✦గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం: జిల్లా ఎస్పీ
✦టెక్కలి: అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు
✦రణస్థలం: వంతెన కోసం తీసిన గోతిలో పడి బైకర్ మృతి
✦లావేరు: ప్రమాదకరంగా మలుపులు
✦నరసన్నపేట పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐ లేరు

News December 14, 2025

సుస్థిర ఆర్థిక పురోగతిలో ఏపీ: RBI

image

దేశంలో పలు రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్లు RBI తాజా నివేదిక వెల్లడించింది. ‘1.93 కోట్ల టన్నుల పండ్లు, 51.58 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. FY24-25లో GSDP ₹15.93 లక్షల CRకు చేరగా తలసరి జీఎస్డీపీ ₹2.66 లక్షలుగా నమోదైంది. ఆరోగ్య పరంగా సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 74 మార్కులతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో 10వ ప్లేస్‌లో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.

News December 14, 2025

FLASH: రామన్నపేటలో కాంగ్రెస్‌కు జై!

image

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీలో ఓటర్లు కాంగ్రెస్‌కు జైకొట్టారు. హస్తం బలపర్చిన అభ్యర్థి గరిక సత్యనారాయణ భారీ విజయం సాధించారు. సమీప అభ్యర్థులు మిర్యాల మల్లేశం(BRS), నకిరేకంటి నరేశ్(BSP)పై గెలుపొందారు. ఆయన 409 ఓట్లు రాబట్టారు. RPTలో సీనియర్ నాయకులను అందర్నీ కలుపుకొని ఆయన విజయతీరాలకు చేరారు. ఓటర్లకు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.