News February 6, 2025
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మహా మండపంలో వేదోచ్చరణతో స్వాగతం పలికి, శేష వస్త్రంతో సత్కరించి, లడ్డు ప్రసాదం అందజేశారు. అంజన్నను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు
Similar News
News February 11, 2026
NGKL జిల్లాలో 77.64% పోలింగ్ నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలలో సాయంత్రం ఐదు గంటల వరకు 77.64% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ ప్రకటించారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో 80.80 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. కొల్లాపూర్‌లో 80. 10%, నాగర్ కర్నూల్‌లో 73.98% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 62,703 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News February 11, 2026
GNT: రెసిడెన్సీపై టాస్క్ ఫోర్స్ రైడ్.. 8 మంది పురుషులు, 7 మహిళల అరెస్ట్

గుంటూరు బ్రాడీపేటలోని ఓ రెసిడెన్సీలో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 8 మంది పురుషులు, ఏడుగురు మహిళలు కలిపి మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌బీ సీఐ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం అరండల్ పేట పోలీసులకు అప్పగించారు.
News February 11, 2026
చికెన్‌లో ఈ భాగాలు తినకండి

కోళ్ల లంగ్స్‌లోని పరాన్నజీవులు ఎక్కువ వేడిని తట్టుకోగలవు. మనం బాగా ఉడికించినా కొన్ని నశించకపోవచ్చు. పెస్టిసైడ్స్ తింటే కోడి తలలో చిన్న కణితులు ఏర్పడతాయి. కాబట్టి తల జోలికి వెళ్లకపోవడం బెటర్. కాళ్ల వేళ్లు, ప్రేగులు, జీర్ణాశయంలో బాక్టీరియా పేరుకుంటుంది. సాధారణంగా శుభ్రం చేస్తే అవి పోవు. స్కిన్ పూర్తిగా కొలెస్ట్రాల్ కావడంతో ఊబకాయులు, హార్ట్ సమస్యలు ఉన్నవారు తినకండి.


