News March 8, 2025
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న కమెడియన్ సదన్న

కొండగట్టు అంజన్నను యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ కమెడియన్ సదన్న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సదన్న మాట్లాడుతూ.. అంజన్నను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అంజన్న ఆశీర్వాదంతో పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 18, 2026
కర్నూలులో బహిరంగ హెచ్చరిక బ్యానర్లు

కర్నూలు నగరంలో ఆస్తిపన్ను మొండి బకాయిల వసూళ్లను నగరపాలక సంస్థ మరింత కఠినతరం చేస్తోంది. ఈక్రమంలో ‘మేలుకో బకాయిదారుడా!’ అనే శీర్షికతో ఆదివారం హెచ్చరికాత్మక బ్యానర్లను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో అయినా బకాయిదారుల్లో చైతన్యం వచ్చి, స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మొండి బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
News January 18, 2026
సరస్ మేళాకు రూ.25కోట్ల ఆదాయం: కలెక్టర్

గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజార్ రికార్డు సృష్టించింది. మొత్తం 343 స్టాల్స్ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25కోట్ల ఆదాయం వచ్చింది. ఆదివారం జరిగిన సరస్ ముగింపు సభలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ విషయాన్ని వెల్లడించారు. సరస్ మేళా టెస్ట్ మ్యాచ్ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామం కలెక్టర్ కొనియాడారు.
News January 18, 2026
జగిత్యాల: తల్లిదండ్రులను పోషించని కుమారులకు కౌన్సిలింగ్

కన్న తల్లిదండ్రులను పోషించని కుమారులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం జగిత్యాల, మల్యాల, ధర్మపురి మండలాలకు చెందిన కుమారులకు పిలిపించి అవగాహన కల్పించారు. వారు తల్లిదండ్రులను పోషిస్తామని అంగీకరిస్తూ ఒప్పంద పత్రాలు సమర్పించారు. జిల్లా కార్యదర్శి విశ్వనాథ్, హన్మంత రెడ్డి ఉన్నారు.


