News June 26, 2024
కొండగట్టు అంజన్న సన్నిధికి పిఠాపురం MLA పవన్ కళ్యాణ్

ఈ నెల 29న ఏపీ డిప్యూటీ సీఎం,పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనమయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రచార సమయంలో కొండగట్టులోనే వారాహి వాహన పూజ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు.
Similar News
News February 23, 2026
భయపడకండి.. ప్రభుత్వం అండగా ఉంది: మంత్రి దుర్గేశ్

రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.
News February 23, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై YS షర్మిల సీరియస్!

రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
News February 23, 2026
తూ.గో: 58 కేంద్రాలు @ 43,108 మంది విద్యార్థులు

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 58 కేంద్రాల్లో 43,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా, అరగంట ముందు వెళ్లే నిబంధనను రద్దు చేశారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, నిఘా ఏర్పాటు చేశారు.


