News April 2, 2025
కొండగట్టు : అంజన్న సన్నిధిలో దీక్షలు స్వీకరణ

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు పలు జిల్లాలకు చెందిన భక్తులు హనుమాన్ మాల స్వీకరించారు . స్థానిక ఆలయ అర్చకులు పవన్, అనిల్, శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో 11 రోజులు పాటు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈ రోజు మాల వేసుకున్న స్వాములు చిన్న జయంతికి విరమణ చేస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం దీక్ష స్వాములు అంజన్నను దర్శించుకున్నారు .
Similar News
News April 29, 2025
వినుకొండలో బుల్లెట్ బైకు చోరీ

వినుకొండలో దావూద్ హోటల్ ముందు నిలిపిన (AP 39QQ 1408) రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ 650 సీసీ చోరీకి గురైంది. గుర్తు తెలియని యువకుడు హోటల్‌కు వచ్చి టిఫిన్ చేసి కౌంటర్ వద్దకు వచ్చి తనది విజయవాడ అని పరిచయం చేసుకున్నాడు. తనకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టమని, ఓ సారి ట్రైల్ చూస్తానని చెప్పి తీసుకెళ్లినట్లు బాధితుడు రబ్బాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News April 29, 2025
RTCని కనుమరుగు చేసిన కేసీఆర్: జగ్గారెడ్డి

RTCని కేసీఆర్ కనుమరుగు చేశారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఉచిత బస్సుకు కేసీఆర్ విమర్శిస్తున్నారంటే ఉచిత బస్సు సక్సెస్ అయినట్లేనని తెలిపారు. దీంతో కేసీఆర్‌కు నష్టం కలుగుతుంది కాబట్టే వెస్ట్ అంటున్నారని పేర్కొన్నారు. RTCకి దానికి ప్రాణం పోసిన ఘనత రాహుల్ గాంధీ, అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు.
News April 29, 2025
భద్రకాళి ఆలయంలో కమ్యూనిటీ పోలీసింగ్‌పై అవగాహన

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైన బాధితులు ఎవరిని సంప్రదించాలి, 1930 నంబర్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి, మత్తు పదార్థాల వినియోగం, విక్రయం ద్వారా కలిగే నష్టాలను ఎస్ఐ పోచాలు స్థానిక భద్రకాళి దేవాలయంలోని భక్తులకు వివరించారు.