News March 19, 2025
కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డి

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమలై అంజి రెడ్డి కుటుంబ సమేతంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోచ్చరణతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏసిఎస్ రాజు, భావన ఋషి, మేన మహేశ్ బాబు, బండారి మల్లికార్జున్, మల్యాల మండల సీనియర్ నేత ప్రసాద్, బిట్టు పాల్గొన్నారు.
Similar News
News March 20, 2025
నారాయణపేట: 144 సెక్షన్ అమలు

నారాయణపేట జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163(144 సెక్షన్) అమలులో ఉంటుందని జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈపరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు, ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని, ఎలాంటి సభలు,సమావేశాలు, ర్యాలీలు, మైకులు,డిజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించొద్దన్నారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు.
News March 20, 2025
ఖానాపూర్: గుడుంబా విక్రయం.. 2ఏళ్ల జైలు శిక్ష: SI

ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మాసం రాజేశ్వర్ గతంలో గుడుంబా విక్రయిస్తూ పట్టుబడగా కేసు నమోదు చేసి తహశీల్దార్ ముందు బైండోవర్ చేశామని ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్ తెలిపారు. బైండోవర్ ఉల్లఘించి మళ్లీ మద్యం అమ్ముతూ దొరకారన్నారు. దీంతో బైండోవర్ నిబంధనల ప్రకారం నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
News March 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి