News July 13, 2024
కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం 65.39 లక్షలు

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. 35 రోజులకు గాను ఆలయంలో గల 12 హుండీల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కించగా నగదు రూ.65 లక్షల 39 వేల 167 సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 41 గ్రాముల బంగారం, కిలో 850 గ్రాముల వెండి, 38 విదేశీ కరెన్సీలు వచ్చినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
కరీంనగర్: జర్నలిస్టుల డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

తెలంగాణ జర్నలిస్టు ఫెడరేషన్ డైరీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. జర్నలిస్టుల డైరీ తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
News February 24, 2026
KNR: డిజిటల్ జూదం.. పోలీసులకు సవాల్!

కరీంనగర్ జిల్లాలో పేకాటరాయుళ్లు పంథా మార్చారు. పోలీసులకు చిక్కకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తూ జూదం ఆడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని తోటలు, కోళ్ల ఫారాలను అడ్డాలుగా మార్చుకొని.. బయట కాపలాదారులు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. గత మూడేళ్లలో 1,433 మందిని పోలీసులు పట్టుకున్నా.. తాజా సాంకేతిక పోకడలు, పక్కా నిఘా వ్యవస్థ వారికి సవాలుగా మారాయి.
News February 24, 2026
చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించి, స్థానిక నాయకులతో భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.


