News April 10, 2025
కొండగట్టు ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు

ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఉత్సవ కమిటీ ఇవాళ ఏర్పాటైంది. ఛైర్మన్తో పాటు 11 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎండోమెంట్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఉత్సవ కమిటీ సభ్యులు కొండగట్టు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదం అందజేశారు.
Similar News
News December 11, 2025
ఇంద్రకీలాద్రిపై పూల శోభ.. మైమరిపిస్తున్న అలంకరణ.!

ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల దీక్ష విరమణ మహోత్సవం గురువారం ఘనంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు పూల అలంకరణతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. అత్యధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భక్తులను ఈ అలంకరణ ఎంతగానో ఆకర్షిస్తూ, మైమరిపిస్తోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
News December 11, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

సీఎం చంద్రబాబు రేపు కపులుప్పాడలో కాగ్నిజెంట్ సహా ఐటీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం భీమిలి–కపులుప్పాడ ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. రోడ్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనలో లోపాలేమీ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
News December 11, 2025
రూ.100కే T20 వరల్డ్ కప్ టికెట్స్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం 6.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ICC ప్రకటించింది. ఇండియాలో ఫేజ్ వన్ టికెట్స్ రేట్స్ రూ.100 నుంచి, శ్రీలంకలో రూ.295 నుంచి ప్రారంభంకానున్నాయి. FEB 7నుంచి MAR 8 వరకు టోర్నీ కొనసాగనుంది. టికెట్స్ బుక్ చేసుకునేందుకు <


