News April 10, 2025

కొండగట్టు ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు

image

ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఉత్సవ కమిటీ ఇవాళ ఏర్పాటైంది. ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎండోమెంట్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఉత్సవ కమిటీ సభ్యులు కొండగట్టు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదం అందజేశారు.

Similar News

News February 14, 2026

బండి సంజయ్ సమక్షంలో మరిన్ని చేరికలు? బీజేపీ దూకుడు!

image

కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 35 సంఖ్యకు చేరుకున్న పార్టీ వైపు మరికొందరు కార్పొరేటర్లు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే వారు కాషాయ కండువా కప్పుకుని పార్టీలో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చేరికలు కొనసాగితే కార్పొరేషన్‌లో బీజేపీ ఆధిక్యం మరింత బలపడనుంది.

News February 14, 2026

తిరుపతి: ‘పుష్ప’లకు ఫారెస్ట్ యాక్ట్-60తో చెక్.!

image

ఎర్రచందనం అక్రమ రవాణాలో నేరస్తులపై RSASTF కఠినంగా వ్యవహరించనుంది. ఇందులో భాగంగా ఫారెస్ట్ యాక్ట్-60 ప్రకారం ప్రాపర్టీ సీజ్ అమలు చేయాలనే ఆలోచన చేస్తుంది. దీని ద్వారా నిందితుడు.. ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా ఆస్తులు సంపాదించారని DSP స్థాయి అధికారితో విచారణ చేయించి న్యాయపరమైన అంశాలతో నివేదిక సిద్ధం చేస్తారు. నేరం రుజువైతే అతని ప్రాపర్టీ సీజ్ చేయడంతో పాటు ఏడాది పాటు జైలు శిక్ష పడననుంది.

News February 14, 2026

MBNR: మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో కాంగ్రెస్!

image

ఉమ్మడి MBNR జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. MBNR కార్పొరేషన్, GWL, NRPT, అమరచింత, దేవరకద్ర, ALP మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. 11 మున్సిపాలిటీలలో ఛైర్మన్‌లను హస్తగతం చేసుకొని కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు అడుగుదూరంలో ఉన్న పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర మున్సిపాలిటీ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. ఈసారి BRSకు చేదుఅనుభవమే ఎదురైంది.