News April 25, 2024

కొండగట్టు కాషాయమయం.. భారీగా చేరుకున్న భక్తజనం

image

కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి కొండగట్టుకు దీక్షాపరులు, సాధారణ భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మంగళవారం రాత్రి కొండపై ఇసుక వేస్తే రాలనంత రద్దీ నెలకొంది. రద్దీని కంట్రోల్ చేయడం కష్టమైంది. స్వామివారి దర్శనం, మాలవిరమణ, కళ్యాణకట్ట వద్ద గంటల సమయం పడుతోంది. ఇప్పటికి రెండు లక్షల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా.

Similar News

News January 9, 2025

సిరిసిల్ల: ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్పీ

image

సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పండుగకి ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్‌స్టేషన్లో లేదా గ్రామ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 9, 2025

భీమదేవరపల్లి: రేపటి నుంచి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

image

కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 10న స్వామి వారి కళ్యాణం, 11న త్రిశూలార్చన, 12న లక్షబిల్వర్చన, 13న భోగి పండుగ, 14న సంక్రాంతి పండుగ సందర్భంగా బండ్లు తిరుగుట,15న కనుమ ఉత్సవం,16న పుష్పయాగం, నాగవళ్లి, 17న త్రిశూల స్నానం కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు.

News January 9, 2025

తొక్కిసలాట ఘటన బాధాకరం: శ్రీధర్ బాబు

image

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడ్డ భక్తులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు.