News April 10, 2025
కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి పటిష్ఠ ఏర్పాట్లు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఆలయానికి సుమారు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, 45 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు. 5 లక్షల ప్రసాదాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Similar News
News April 20, 2025
DSC: కర్నూలు జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. కర్నూలు జిల్లాలో 209 ఎస్ఏ పీఈటీ, 1,817 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 2,645 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 10 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో మొత్తం 33 పోస్టులు ఉన్నాయి.
News April 20, 2025
DSC: అనంతపురం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉదయం 10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతపురం జిల్లాలో 145 ఎస్ఏ పీఈటీ, 202 ఎస్జీటీ పోస్టులతో కలిపి మొత్తం 807 ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 2 ఎస్జీటీ పోస్టులతో కలిపి జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి.
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.