News April 12, 2025
కొండగట్టు: జయంతి ఉత్సవాల్లో మహిళా పోలీసులు

చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో భక్తుల సౌకర్యార్థం కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 800 మంది పోలీసుల పర్యవేక్షణలో ఉత్సవాలు సజావుగా సాగుతున్నాయి. మహిళా పోలీసులు ఉత్సాహంగా పాల్గొని బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్‌తో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కొండగట్టుకు తరలివస్తున్న హనుమాన్ దీక్షాపరులకు పోలీసులు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 5, 2025
తిరుమల: VIP బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పలు పర్వదినాలు, ప్రత్యేక కైంకర్యాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్ణీత రోజుల్లో టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఈ తేదీలకు ముందురోజు వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.
News December 5, 2025
వికారాబాద్‌లో 39 GPలు ఏకగ్రీవం

వికారాబాద్‌లో ఈ నెల 11న జరగనున్న తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను డీపీవో డా.జయసుధ ప్రకటించారు. జిల్లాలోని 39 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. సీఎం సొంత నియోజకవర్గంలో 13, తాండూరు నియోజకవర్గంలో 27 సర్పంచ్ పీఠాలు ఏకగ్రీవం అయ్యాయి.
News December 5, 2025
పుతిన్‌కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్‌కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.


