News April 12, 2025
కొండగట్టు: జయంతి రోజు ప్రత్యేక అలంకారణలో అంజన్న

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఇవాళ చిన్న జయంతి పురస్కరించుకొని ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ముందుగా వివిధ అభిషేకాలు నిర్వహించి, తర్వాత పూలు పండ్లతో అలంకరించి పూజలు చేశారు. చిన్న జయంతి సందర్భంగా లక్షలాదిగా దీక్షా పరులు, సామాన్య భక్తులు కొండగట్టు తరలివస్తున్నారు. అంజన్న దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
Similar News
News October 23, 2025
ఇండియన్ ఆర్మీకి ‘భైరవ్’

భారత సైన్యానికి మరింత బలం చేకూరనుంది. అత్యాధునిక టెక్నాలజీ, శక్తిమంతమైన ఆయుధాలతో స్పందిస్తూ రిస్కీ ఆపరేషన్లు చేసే ‘భైరవ్’ బెటాలియన్ సిద్ధమైతున్నట్లు ఆర్మీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ తెలిపారు. నవంబర్ 1న తొలి బెటాలియన్ సైన్యంలో చేరనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో 25 బెటాలియన్లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈ భైరవ్ యూనిట్‌లో 250 మంది సైనికులు, 7-8 మంది అధికారులు ఉంటారు.
News October 23, 2025
కార్తీక మాసం: ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

ఉల్లి, వెల్లుల్లి రజో, తమో గుణాల ప్రభావాన్ని పెంచుతాయి. రజో గుణం మనస్సులో కోరికలను పెంచుతుంది. తమో గుణం వల్ల బద్ధకం, అజ్ఞానం ఆవరించే అవకాశాలుంటాయి. ఇది దైవ స్మరణ కోసం కేటాయించిన పవిత్ర సమయం. ఈ సమయంలో పూజలు ఏకాగ్రతతో చేయాలంటే, ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. అది జరగాలంటే భగవత్ చింతనకు ఆటంకం కలిగించే ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక శుద్ధి కోసం వీటిని తినకుండా ఉండటం ఉత్తమం అని సూచిస్తుంటారు.
News October 23, 2025
భద్రాద్రి: అన్ని రుణాలను వసూలు చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ఏపీఎం, సీసీలతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం కలెక్టరేట్‌లో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నాన్-పెర్ఫార్మెన్స్ రుణాలు, లైవ్‌హుడ్ యూనిట్ల ఏర్పాటు, చేపల, కౌజుపిట్టలు, మేకలు, నాటుకోళ్ల పెంపకం, మహిళా సమాఖ్య గ్రూపుల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో రుణ బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.