News March 25, 2024

కొండగట్టు నిధుల దుర్వినయోగంపై లోతుగా దర్యాప్తు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నిధుల దుర్వినియోగంపై దేవదాయశాఖ ఉన్నతాధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆలయానికి సంబంధించి 2014 నుంచి రికార్డుల పరిశీలనకు నిర్ణయించినట్లు, క్యాష్‌బుక్‌, బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇతర ఫైళ్లను రీకన్సులేషన్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.గతంలో పనిచేసిన ఈవోల పదవీకాలంలోనూ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికరులు భావిస్తున్నారు.

Similar News

News January 7, 2026

KNR: ‘పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఉండాలి’

image

కలెక్టరేట్‌, విద్యార్థుల రక్షణే ధ్యేయంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ‘స్నేహిత’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన VCలో ఆమె మాట్లాడారు. లైంగిక వేధింపుల నివారణకు ఈ పెట్టెలు కీలకమని, వీటి తాళాలు మహిళా కానిస్టేబుళ్ల వద్దే ఉంటాయని స్పష్టంచేశారు. విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.

News January 7, 2026

కరీంనగర్: ‘సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి’

image

సైబర్ నేరాల పట్ల మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ రమేష్ సూచించారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనియల్ మోసాలు, సైబర్ స్టాకింగ్‌పై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

News January 5, 2026

కరీంనగర్: ఓటర్ల జాబితాలో ‘గందరగోళం’

image

కరీంనగర్ నగరపాలక సంస్థ ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. వార్డుల వారీగా కాకుండా పాత బూత్‌‌ల ప్రకారమే జాబితాను రూపొందించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒక డివిజన్ ఓటర్లు మరోచోట చేరారు. వెదురుగట్ట గ్రామ ఓటర్లు తీగలగుట్టపల్లి జాబితాలో ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ తప్పిదాలపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. అధికారులు ఎప్పుడు సరిచేస్తారో వేచి చూడాలి.