News September 11, 2024
కొండగట్టు బస్సు ప్రమాద ఘటనకు ఆరేళ్లు!
కొండగట్టు రోడ్డులో బస్సు ప్రమాదం జరిగిన ఘటనకు నేటితో ఆరేళ్లు పూర్తైంది.108 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాటు రోడ్డు లోయలో పడి 65 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడి జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే ఆతి పెద్ద ప్రమాదంగా నిలిచింది. ఆ తర్వాత ప్రభుత్వం రూ.1.50 కోట్లు వెచ్చించి ఘాట్ రోడ్డుకు ఇరువైపులా పలుచోట్ల రక్షణ గోడలు, తక్కువ ఎత్తుతో వేగనియంత్రికలు నిర్మించింది.
Similar News
News October 3, 2024
కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.
News October 3, 2024
KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
News October 3, 2024
ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మానేరు డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.