News April 10, 2025
కొండగట్టు: రేపటి నుంచి హనుమాన్ చిన్న జయంతి

ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రేపటి నుంచి చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు, 24/7 భక్తులకు దర్శనం ఉంటుందని ఆలయ స్థానాచార్యులు కపిందర్ తెలిపారు. ఈ సారి సామాన్య భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News November 21, 2025
యాక్టివ్ పాలిటిక్స్లోకి కొడాలి, వల్లభనేని

ఉమ్మడి కృష్ణా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా గుర్తింపున్న నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. వీరు కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో పాలిటిక్స్కి కాస్త గ్యాప్ ఇచ్చారు. తాజాగా వీరిద్దరూ జగన్తో భేటీ కావడంపై వార్తల్లో నిలిచారు. కొడాలి, వంశీ తిరిగి యాక్టివ్ అవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ మళ్లీ ప్రజలతో మమేకమవుతూ, పలు రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
News November 21, 2025
గోవింద కోటితో శ్రీవారి VIP బ్రేక్ దర్శనం

యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, సనాతన ధర్మంపై అనురక్తి కల్పించడమే లక్ష్యంగా TTD కీలక నిర్ణయం తీసుకుంది. రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు VIP దర్శనాన్ని కల్పిస్తోంది. 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 1,00,01,116 సార్లు రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.
News November 21, 2025
NLG: డబుల్ లబ్ధిదారుల్లో.. 46 మంది అనర్హులు..!

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో 46 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారి స్థానంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా అర్హులైన వారిని పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 552 మంది లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తెలిపారు.


