News April 12, 2025
కొండగట్టు: సీసీ కెమెరా ద్వారా నిరంతర పర్యవేక్షణ

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో భద్ర ఏర్పాట్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. CCTV ద్వారా నిరంతరం పర్యవేక్సీస్తూ, నిరంతరం సిబ్బందికి వైర్లెస్ సెట్ ద్వారా సూచనలు చేస్తున్నామన్నారు.
Similar News
News December 6, 2025
శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని శనివారం రోజున నైవేద్యంగా పెడితే..?

శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదమంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. శనివారం ఆయనకు అటుకులు, అన్నం, బెల్లం, కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగి, ఇంట్లో ధనవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని ఆయనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచితే.. సంకటాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు సుగుణాల భర్త వస్తాడని నమ్మకం.
News December 6, 2025
NRPT: అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

అప్పంపల్లిలో నవంబర్ 18న ఇంటి నుంచి<<18355152>> అదృశ్యమైన గోవర్ధన్ రెడ్డి<<>> <<18480571>>మృతదేహం శుక్రవారం లభ్యమైంది.<<>> ఆర్థిక సమస్యలు, మతిస్థిమితం లేమి కారణంగా ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గ్రామంలోని ఓ బావి పక్కన ఉన్న పొదల్లో ఆయన శవం లభ్యం కాగా, కుటుంబ సభ్యులు దుస్తుల ఆధారంగా గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 6, 2025
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పేరం స్వర్ణలత

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 మందిని ప్రకటించగా.. అందులో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన పేరం స్వర్ణవ్రతం ఉన్నారు. స్వర్ణలత ఇప్పటికే వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.


