News April 12, 2025
కొండగట్టు: సీసీ కెమెరా ద్వారా నిరంతర పర్యవేక్షణ

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో భద్ర ఏర్పాట్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. CCTV ద్వారా నిరంతరం పర్యవేక్సీస్తూ, నిరంతరం సిబ్బందికి వైర్లెస్ సెట్ ద్వారా సూచనలు చేస్తున్నామన్నారు.
Similar News
News April 10, 2026
పెద్దపల్లి కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని అదనపు కలెక్టర్ వేణు శుక్రవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News April 10, 2026
రేపు నిజామాబాద్ జిల్లాకు RSS చీఫ్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ శనివారం NZB జిల్లాలో పర్యటించనున్నారు. RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు కంద కుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
News April 10, 2026
HDFC వినియోగదారులకు అలర్ట్!

సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.


