News April 11, 2025
కొండగట్టు: హనుమాన్ జయంతి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కొండగట్టు అంజన్న ఆలయంలో జరుగుతున్న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఆలయ అధికారులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మాల విరమణ కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. స్నానమాచరించే కోనేరును పరిశీలించి ఎప్పటికప్పుడు నీరు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని సూచించారు.
Similar News
News April 14, 2026
కొవిడ్ వ్యాక్సిన్‌తోనే నాన్న చనిపోయారు: వార్న్ కుమారుడు

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్ అని ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాక్సిన్‌తో తన తండ్రి అనారోగ్య సమస్యలు ముదిరాయని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఇష్టం లేకపోయినా ఇతరుల ఒత్తిళ్లతో ఆయన టీకా డోసులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అంత్యక్రియలప్పుడే చెప్పాలని అనుకున్నా కొన్ని కారణాలతో ఆగిపోయానని అన్నారు. కాగా షేన్ వార్న్ 2022లో చనిపోయారు.
News April 14, 2026
పాలకోడేరు: ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి

గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 14, 2026
40 నిమిషాల పాటు మోదీ-ట్రంప్ ఫోన్ కాల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్ కాల్‌లో 40 నిమిషాల పాటు మాట్లాడారు. US-ఇరాన్ సీజ్‌ఫైర్ ప్రకటించాక వీరిద్దరూ కాల్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలోని పరిస్థితులు సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించారు. హార్ముజ్ భద్రతపైన కూడా చర్చించినట్లు ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


