News February 4, 2025

కొండపాకలో సనీ నటుడు సుమన్

image

అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం గుండె సంబంధిత సమస్యలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంజీవని ఆసుపత్రి సేవలు అమోఘమని సినీ నటుడు సుమన్ అన్నారు. సోమవారం కొండపాకలోని సంజీవని ప్రశాంతి నికేతన్ శిశు హృదయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను సుమన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణితో కలిసి ఆయన సందర్శించారు. గుండె సంబంధిత చిన్నారులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. 

Similar News

News October 18, 2025

NLG: నేడే లాస్ట్ ఛాన్స్.. ఒక్కరోజే 1,387 దరఖాస్తులు

image

మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఊపందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 1,387 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 8 గంటల వరకూ లైన్లో ఉండి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటివరకు మొత్తం 2,439 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది.

News October 18, 2025

ఉమ్మడి జిల్లాలో మరో ఆరు కొత్త బ్రాంచులు

image

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చింది. చిలుకూరు, మోతె, శాలిగౌరారం, నాంపల్లి, పెద్దవూర, మిర్యాలగూడ టౌన్లో 2వ బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఆరు బ్రాంచులతో కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 47 బ్రాంచీలు అవుతాయని తెలిపారు.

News October 18, 2025

DDAలో 1,732 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 1,732 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(స్టేజ్1, స్టేజ్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, Jr ఇంజినీర్, SO, స్టెనోగ్రాఫర్, JSA, మాలి, MTS తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://dda.gov.in/. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.