News August 21, 2024
కొండపాక: చెరువులో పడి ఇద్దరు మృతి
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చెరువులో ఈత కొడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి చెందిన వారు.. సిరిసినగండ్లకు బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చారు. స్నానానికి ఊర చెరువులోకి వెళ్లి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 13, 2024
మెదక్: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’
ఈనెల 28 నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.
News September 12, 2024
అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నేత సీతారాం ఏచూరి: మంత్రి పొన్నం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అకాల మరణం తనని తీవ్ర ధ్రిగ్బాంతికి గురిచేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సీతారాం ఏచూరి కింది స్థాయి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడు అని, ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాల్లో పోరాడారని గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
News September 12, 2024
తొగుట: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తొగుట మండలం కన్గల్ గ్రామం చెందిన దొమ్మాట స్వామి(30) రైతు మూడెకరాల భూమి కౌలుకు తీసుకున్నారు. పంట పెట్టుబడితో పాటు సుమారు రూ.8 లక్షలు అప్పు అవ్వగా అప్పు తీర్చే మార్గం లేక పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.