News February 6, 2025
కొండపాక: సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
కొండపాక మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 6, 2025
ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు SRCL కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద బుధవారం రాత్రి రూ.లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా గురువారం మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
News February 6, 2025
కోహ్లీ గాయం శ్రేయస్‌కు వరమైంది!
కోహ్లీ గాయపడటం వల్లే ENGతో తొలి వన్డేలో తనకు ఆడే అవకాశం వచ్చిందని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. ‘మ్యాచులో ఆడట్లేదని తెలిసి నిన్న రాత్రి సినిమా చూద్దామని అనుకున్నా. అప్పుడే కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. కోహ్లీ మోకాలికి గాయమైందని, అతని స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు. అందుకే తొందరగా నిద్రపోయా’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఈ మ్యాచులో శ్రేయస్ 36 బంతుల్లో 59 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
News February 6, 2025
యాదాద్రి క్షేత్రంలో రేపు చండీ హోమం
యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.