News September 14, 2024
కొండపిలో కిలో పొగాకు ధర రూ.358
కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలానికి జువ్విగుంట, అయ్యవారిపాలెం, తంగేళ్ల, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు 1354 బేళ్లను వేలానికి తీసుకొని వచ్చారు. అందులో 1009 బేళ్లను కొనుగోలు చేశారు. వ్యాపారులు వివిధ కారణాలతో 345 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.358, కనిష్ఠ ధర కేజీ రూ.180, సరాసరి ధర రూ.266.88 పలికింది.
Similar News
News October 5, 2024
ప్రకాశం: ‘ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టండి’
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు సవరణలకు సంబంధించి సెప్టెంబరు నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను రెండు రోజులలోగా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఆర్.శ్రీలత సంబంధిత అధికారులకు చెప్పారు. ఈ నెల 29వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించాల్సి ఉన్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబరులో ఆమె సమీక్ష నిర్వహించారు.
News October 4, 2024
జె. పంగులూరు: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం బోదవాడలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చిన్నారులు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. దసరా సెలవులకు తాత గారి ఊరు వచ్చిన చిన్నారులు సాయంత్రం ఆడుకుంటూ ఇంటి వెనక ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కందుల బ్రహ్మారెడ్డి (8), కందుల సిద్ధార్థ రెడ్డి (6) మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
News October 4, 2024
ప్రకాశం: బైక్ టైర్‌లో చున్నీ ఇరుక్కుని.. మహిళ మృతి
సంతమాగులూరు మండలం ఏల్చూరులోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్ వెనుక టైర్‌లో చున్నీ చుట్టుకోవడంతో రోడ్డు మీదపడి బల్లికువ మండలం కొప్పెరపాడుకు చెందిన మహిళా అక్కడకక్కడే మృతి చెందింది. నరసరావుపేట నుంచి కొప్పెరపాడు వైపు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.