News October 12, 2024
కొండపి పొగాకు బోర్డులో ముగిసిన కొనుగోళ్లు
శుక్రవారం రోజుతో కొండపి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 2023-24కు సంబందించి పొగాకు కొనుగోళ్లు ముగిశాయని వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునిల్ కుమార్ తెలిపారు. కొనుగోళ్లు 154 రోజుల పాటు నిర్వహించామని, వేలంలో 50 కంపినీలు పాల్గొన్నాయన్నారు. రూ.467కోట్ల కొనుగోళ్లు జరిగాయని ఆయన వెల్లడించారు. రోజుకు సగటున 873 బేళ్ళ అమ్మకాలు జరిగాయన్నారు.
Similar News
News November 3, 2024
పెండింగ్ చలానాలను వెంటనే చెల్లించాలి: ప్రకాశం ఎస్పీ
వాహనదారులు పెండింగ్‌లో ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం నుంచి శనివారం ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని లేదంటే వాహనాన్ని పోలీసులు జప్తు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సమీపంలోని మీసేవ కేంద్రాలలో, ఫోన్ పే ద్వారా చలానాలను చెల్లించాలని కోరారు.
News November 2, 2024
ప్రకాశం: రైలు కిందపడి వ్యక్తి మృతి
తర్లుపాడు మండలంలోని సూరెపల్లి రైల్వే గేట్ సమీపంలో శనివారం రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 2, 2024
ప్రకాశం: ‘పల్లె పండుగ పనులు పూర్తి కావాలి’
ప్రకాశం జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టే సి.సి రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులు డిసెంబర్ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ అధికారులతో సమావేశమై, పల్లె పండుగ కార్యక్రమంలో మంజురైన 1140 కొత్త పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు, డ్వామా, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉన్నారు.