News March 29, 2024

కొండబిట్రగుంట: రూ.16.39 లక్షల ఆదాయం

image

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇటీవల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో గురువారం స్వామివార్ల హుండీ కానుకలను లెక్కించారు. ఈక్రమంలో రూ.16,39,801 ఆదాయం వచ్చిందని ఈవో రాధా కృష్ణ తెలిపారు. ఇది గతేడాది కంటే ఎక్కువ అని చెప్పారు.

Similar News

News December 9, 2025

నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

image

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.

గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

image

నగరంలో నిన్న సాయంత్రం బోసు బొమ్మ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్‌ను తీయమన్నందుకు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై బ్లేడ్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సంతపేట పోలీసులు గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. నిందితులకు నేర చరిత్ర లేదని, క్షణికావేశంలో ఈ ఘటన జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపట్ల నగరవాసులు అభినందనలు తెలిపారు.