News February 13, 2026

కొండమల్లేపల్లి: వేధింపులతో యువరైతు ఆత్మహత్య

image

కొండమల్లేపల్లి మండలం పన్నితండాకు చెందిన రమావత్ రాజేశ్ (26) అనే యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10న కేశ్యతండాకు చెందిన తిరుపతి అనే వ్యక్తి రాజేశ్‌ను తీసుకెళ్లి మద్యం తాగించి, శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన రాజేశ్ పురుగుల మందు తాగాడు. దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అజ్మీరా రమేశ్ తెలిపారు.

Similar News

News March 14, 2026

యుద్ధం ఎఫెక్ట్.. చిత్తూరు జిల్లాలో పెరిగిన వాటర్ బాటిల్ ధరలు?

image

చిత్తూరులో శనివారం జిల్లా <<19383334>>వాటర్<<>> అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. యుద్ధ ప్రభావంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ ధరలు భారీగా పెరిగాయని తయారీదారులు అంటున్నారు. దీని వలన తమపై అధిక భారం పడుతోందని, దీంతో వాటర్ బాటిల్ ధరలను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన ధరలకు డీలర్లు సహకరించాలని జిల్లా వాటర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.

News March 14, 2026

ప.గో: భార్య గొంతు కోసిన భర్త

image

భార్య గొంతును బ్లేడుతో కోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. కరగాని దిల్లేశ్వరి భర్త గోవిందు మధ్య మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆమె పని చేస్తున్న డ్రై ఫ్రూట్స్ షాపు వద్దకు వచ్చి తనను బండిపై ఇంటికి తీసుకు వెళ్లాలని కోరాడు. ఆమె బండి నడుపుతుండగా వెనక కూర్చున్న గోవిందు తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో పీక కోసి పరారయ్యాడు.

News March 14, 2026

రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. BRS నుంచి వచ్చిన జగిత్యాల MLA సంజయ్‌కి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైరం ముదిరింది. దీనిపై జీవన్ రెడ్డి Way2Newsతో మాట్లాడుతూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరించినా లాభం లేదని వాపోయారు.