News April 25, 2024
కొండయ్య నామినేషన్‌కి రానున్న హీరో నిఖిల్

యువ సినీ హీరో నిఖిల్ మామ, చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం చీరాల వస్తున్నారు. కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈమధ్య ఆయన తన బావ అమర్నాథ్, మహేందర్నాథ్ లతో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ను కలుసుకోగా పార్టీ తరఫున ప్రచారం చేయాలని ఆయన కోరారు.
Similar News
News February 9, 2026
మార్కాపురం: లోయలో పడిన కారు.. ఒకరి మృతి

మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. CSపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వివరాల ప్రకారం.. కురిచేడు మండలానికి చెందిన విష్ణు భార్గవ్(25) గత నెల 17న తిరుమలనాథ స్వామి తిరుణాల నిమిత్తం కోనపల్లికి కారులో వెళ్లాడు. తిరిగి వస్తుండగా CSపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డు లోయలో కారు పడిపోయింది. ఇవాళ ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 9, 2026
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. 40లక్షల లడ్డూలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.
News February 8, 2026
మార్కాపురం: పలకల క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.


