News May 3, 2024

కొండాపురం: ఇన్నోవా, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

కొండాపురం మండలం వెంకటాపురం వద్ద శుక్రవారం ఉదయం ఇన్నోవా, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముద్దనూరు మండలం తిమ్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివ శంకర్ అనే వ్యక్తి బైకులో తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా ఇన్నోవా కారు వచ్చి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా బైక్‌లో ప్రయాణిస్తున్న అతని భార్యకు గాయాలవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 14, 2024

కడపకు రానున్న గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్

image

ప్రముఖ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈనెల 18న కడపకు రానున్నట్టు తెలుస్తోంది. కడపలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్దదర్గాలో నిర్వహించే ముషాయర కార్యక్రమానికి వస్తున్నట్లు సమాచారం. 16న పెద్ద దర్గా గంధ మహోత్సవం, 17న ఉరుసు, 18న ముషాయిర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ముషాయిరా కార్యక్రమానికి ఒక అతిధి రావడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 14, 2024

‘అంతర్జాతీయ స్థాయికి దీటుగా కడప విమానాశ్రయం’

image

పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి కడప ఎయిర్ పోర్ట్ నూతన భవన నిర్మాణ పనులను చేపట్టేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి దీటుగా కడప నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పటిష్టపరచాలన్నారు.

News November 13, 2024

పులివెందులకు చేరుకున్న వైఎస్ సునిత

image

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పులివెందుల చేరుకున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో తనతో పాటు ఆమె చెల్లెలు వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేయడానికి డీఎస్పీని కలిసేందుకు ఎదురు చూస్తున్నారు. గతంలో సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన సునీత, తాజాగా ఇక్కడ ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామన్న కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ ప్రకటనతో పులివెందుల వచ్చారు.