News April 14, 2025

కొండాపూర్:ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

image

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు. అన్ని పాఠశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. nవేసవి సెలవులో తరగతులు నిర్వహించవద్దని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

సంగారెడ్డి: రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ

image

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి పిలవాలని చెప్పారు. జిల్లాలోని 15,926 మహిళా సంఘాలకు 16.78 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 24, 2025

యూకేని వీడనున్న మిట్టల్!

image

భారత సంతతి వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ యూకేని వీడనున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం, కుటుంబ వ్యాపారాలపై కొత్త రూల్స్, ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా యూకేలో పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పన్నులు లేని దుబాయ్‌లో సెటిల్ కానున్నారు. ఇప్పటికే అక్కడ ఓ ల్యాండ్ కొన్నారు. కాగా మిట్టల్ $21.4 బిలియన్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో 104వ స్థానంలో ఉన్నారు.

News November 24, 2025

జగిత్యాల: ‘మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు’

image

ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడో విడతగా 3,57,098 మహిళా సంఘాలకు రూ.304 కోట్ల రుణాలు విడుదల చేసినట్లు తెలిపారు. రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా రుణాల పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.