News April 3, 2025
కొండాపూర్ ఆర్ఐ సస్పెండ్.. తహశీల్దార్ బదిలీ

వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవకతవలకు పాల్పడిన కొండాపూర్ ఆర్ఐ మహదేవుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తరుడు జారీ చేశారు. తహశీల్దార్ అనితను నారాయణఖేడ్ ఆర్టీవో కార్యాలయం బదిలీ చేశారు. ఆర్ఐ తప్పుడు నివేదిక ఆధారంగా వారసత్వ బదిలీ సర్టిఫికెట్ ఇచ్చారని కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేయించిన కలెక్టర్ వాస్తవమని తేలడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News April 11, 2025
ADB: మట్కా నిర్వహిస్తున్న మహిళ.. నలుగురిపై కేసు:CI

ఆదిలాబాద్ ఖుర్షిద్ నగర్ లో మట్కా స్థావరం నిర్వహిస్తున్న వారిపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ రావు వివరాల ప్రకారం.. షేక్ నజ్జు అనే మహిళ కాలనీలో మట్కా నిర్వహిస్తుండగా.. హుస్సేన్, సాహిల్లు మట్కా ఆడటానికి రాగా వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మట్కా డబ్బులను షేక్ నజ్జు మరో నిర్వాహకుడు నజీమ్ ఉద్దీన్ అలియాస్ బబ్లుకు జమ చేస్తుందన్నారు. దీంతో బబ్లుపై సైతం కేసు చేశారు.
News April 11, 2025
సదాశివపేట రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్లాట్ బుకింగ్

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానానికి సదాశివపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎంపికైంది. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యానికి వెళ్లిన 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ విధానం కింద రాష్ట్రంలో 22 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట మాత్రమే ఎంపికైందని జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి తెలిపారు.
News April 11, 2025
ADB: భారీగా అక్రమ మద్యం స్వాధీనం.. ఐదుగురిపై కేసు

బోథ్ మండలంలోని కౌట(B), ధన్నూర్(B) గ్రామాల్లో దాడులు నిర్వహించగా అక్రమ మద్యం పట్టుబడిందని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. కౌట గ్రామంలోని బెల్ట్ షాపులో రూ.90,000 వేల విలువైన 690 మద్యం బాటిళ్లు, ధన్నూర్లో రూ.1,34,000 విలువైన 587మద్యం బాటిల్లు దొరికాయన్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, రత్నపురం సాయన్న, VDCకి చెందిన వ్యక్తులు శ్రీకాంత్, రాజేశ్వర్ రెడ్డి, భూమారెడ్డిలపై కేసులు నమోదు చేశామన్నారు.