News April 5, 2025
కొండాపూర్: నమోదు పెంచే బాధ్యత HMలదే: డీఈవో

ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు పెంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. మల్కాపూర్లో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల శిక్షణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో సాంకేతికను ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రాథమిక విద్యార్థులకు ఆటపాటలతో బోధన చేసేలా చూడాలని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది.
News September 19, 2025
వాహనదారులకు గుడ్ న్యూస్.. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు

AP: పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించడంతో ఓల్డ్ వెహికల్స్పై గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుంచి రూ.3వేలకు తగ్గనుంది.
News September 19, 2025
HYD: రూ.3కోట్ల బంగారం.. అలా వదిలేశారు

గత నెల 22న శంషాబాద్ విమానాశ్రయంలో 2 లగేజీ బ్యాగులు అలాగే ఉండిపోయాయి. వాటిని ఎవరూ తీసుకెళ్లలేదు. సిబ్బంది పరిశీలించగా బంగారం కనిపించింది. 3379.600 గ్రాముల బరువు ఉంటుంది. దీని విలువ రూ.3.36 కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కడపకు చెందిన ఇద్దరు వ్యక్తలు కువైట్ నుంచి తెచ్చినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.